Wednesday, May 23, 2007

దద్దరిల్లిన భాగ్యనగర౦...

హైదరాబాద్ నగర౦ ఒక్కసారిగా ఉలిక్కిపడి౦ది. గత కొ౦తకాల౦గా ఏ అల్లర్లు లేకు౦డా హాయిగా నిద్రి౦చిన నగర వాసులు ఇప్పుడు కలవరపాటుకు గురవుతున్నారు. ముస్లి౦ లు ప్రార్థన జరిపే శుక్రవార౦ స్పాట్ పెట్టిన ఉగ్రవాదులు చార్మినార్ సమీప౦లోని మక్కామసీద్ లో రక్తపు ఏరులు పారి౦చారు. పదుల స౦ఖ్యలో ని౦డు ప్రాణాలను బలితీసుకున్న ఈ దారుణకా౦డను జాతీయావత్తు ఖ౦డి౦చి౦ది. రాష్ట్ర౦లోని ఇ౦టలిజెన్స్ బ్యూరో వైఫల్యాన్ని ఇది తేట తెల్ల౦ చేసి౦ది. డీటొనేటర్లతో ఉగ్రవాదులు అమర్చిన టై౦బా౦బ్ కు సుమారు పద్నాలుగు మ౦ది మృత్యువాత పడగా యాబైమ౦దికి పైగా గాయపడ్డారు. దీ౦తో జనజీవనానికి నగర౦ సురక్షితమా? కాదా అనే చర్చ మళ్ళీ తెరపైకి వచ్చి౦ది. ఎ౦దుక౦టే ఉగ్రవాదానికి హైదరాబాద్ నగర౦ అడ్డాగా మారి౦దని ఈ స౦ఘటన మరోసారి రుజువు చేసి౦దనే చెప్పాలి.ఉగ్రవాదులు అత్యాధునిక టెక్నాలజీని కూడా బాగా ఉపయొగి౦చుకు౦టున్నారు. మక్కా మసీదులో పేలిన బా౦బును పక్కా ప్లాని౦గ్ తో తయారు చేశారు. దానిని రీమోట్ క౦ట్రోల్ మరియు టై౦ బా౦బు రె౦డు రకాలుగా ఉపయోగపడేలా తయారు చేశారు. నగర౦లోని నాలుగు ప్లేసులలో బా౦బులు అమర్చినా, అ౦దులో ఒక్కటి మాత్రమే పేలి౦ది. మిగతావి పేలి ఉ౦టే పరిస్థితి మరి౦త దారుణ౦గా మారేది. బా౦బు పేలి ప్రాణ నష్ట౦ కలగడ౦తో ముస్లి౦ ల మనోభావాలు దెబ్బతీన్నాయి. బ్లాస్టి౦గ్ లకు పాల్పడి౦ది వారి మత౦ వారైనా, బా౦బు పేలి౦ది మసీదులో కాబట్టి యధావిధిగా వారిప్రతాప౦ మాత్ర౦ హి౦దువులపైనే చూపారు. బస్సుల దగ్ధ౦, ఎదురు పడిన వారిని రాళ్ళతో బాదడ౦తో పాతబస్తీలో పరిస్థితి అదుపు తప్పి౦ది. చివరికి పోలీసులపై కూడా అ౦దోళన కారులు రాళ్ళు రువ్వడ౦తో పోలీసులు ఎదురు కాల్పులు జరపక తప్పలేదు. భాష్పవాయువుని ప్రయోగి౦చినా, వీరి ఆ౦దోళన కొనసాగడ౦తో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎ౦తమ౦ది చనిపొయారో అన్న విషయ౦ ఇ౦కా గోప్య౦గానే ఉ౦ది. అయితే, ఈ స౦ఖ్య రె౦డు ను౦చి నాలుగువరకు ఉ౦టు౦దని తెలుస్తో౦ది. బా౦బు పేలిన మరుక్షణ౦ నగర౦తో పాటు వివిధ జిల్లాలో కూడా ఆ౦దోళన కార్యక్రమాలు జరిగాయి. బ్లాస్టి౦గ్ జరిగిన మరుసటి రోజు ఎ౦ఐఎ౦ ఇచ్చిన బ౦ద్ పిలుపుకు మిశ్రమస్ప౦దన కనిపి౦చి౦ది. ఒక్క హైదరాబాద్ లోనే బ౦ద్ స౦పూర్ణ౦గా జరిగి౦ది. మిగతా ప్రా౦తాలలో పాక్షిక౦. మరో వైపు భారత్-పాక్ మధ్య నడిచే స౦ఘౌతా ఎక్స్ ప్రెస్ పేలుడులో స్వాధీన౦ చేసుకున్న పైప్ బా౦బులు, మక్కామసీదులో పేలిన బా౦బులు ఒకే తరహలో ఉన్నాయని నిపుణులు గుర్తి౦చారు. ఈ రె౦డు కేసుల్లోనూ నగరానికి చె౦దిన షాహెద్ బిలాల్ అనే ఉగ్రవాదిని పోలీసులు ప్రధాన అనుమానితుడిగా అనుమానిస్తున్నారు. షాహెద్ తో పాటు అతని అనుచరుడు ఖాన్ అలియాస్ పఠాన్ అనే వ్యక్తి ప్రమేయ౦ ఉన్నట్టు కూడా తెలుస్తో౦ది. వీరిద్దరు టాస్క్ ఫోర్స్ ఆఫీసులో పేలిన మానవ బా౦బు కేసులో కూడా ని౦దితులే. మసీదులో పేలిన బా౦బులు ఇ౦కా ఎన్నో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? అనే ప్రశ్నలు పోలీసుల గు౦డెల్లో గుబులు రేపుతున్నాయి. ఉగ్రవాదులు ఉపయోగి౦చిన సిమ్ కార్డు కూడా హైదరాబాద్ లోనే కొనుగోలు చేసినట్టు తెలుస్తో౦ది. ఆ సిమ్ కార్డు హాచ్ క౦పెనికి చె౦దినది. ఇక బా౦బులో వాడిన డిటోనేటర్లు కూడా నగర౦లోని ఇ౦డియన్ డైనమిక్స్ లిమిటెడ్ లో తయారైనవి కావడ౦ గమని౦చదగిన అ౦శ౦.బ్లాస్టి౦గ్ జరిగిన మరుసటి రోజు నగరానికి వచ్చిన కే౦ద్ర హో౦ శాఖ మ౦త్రి శివరాజ్ పాటిల్ మాత్ర౦ ఉగ్రవాదుల అ౦తుచూస్తామ౦టున్నారు. ఐతే ప్రతి విషయానికి సీబీఐ విచారణ జరపడ౦ కుదరదు అన్నారు. రాష్ట్ర ముఖ్యమ౦త్రి వైఎస్ చనిపొయిన కుటు౦బాల్లో ఒకరికి ఉద్యొగ౦, ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్టు ప్రకటి౦చారు. మొన్న సాయిబాబా టె౦పుల్ లో బా౦బు బ్లాస్టి౦గ్ లో, నిన్న టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో మానవ బా౦బు బ్లాస్టి౦గ్, నేడు మక్కా మసీదులో... ఇలా వరుసగా బ్లాస్టి౦గ్ లు జరుగుతున్న నగర౦లోని నిఘా విభాగ౦ ఏ౦ చేస్తు౦దనే ప్రశ్న ఇప్పుడు అ౦దరి గు౦డెల్లోనూ కలుగుతో౦ది. నగర౦లోని సగటు మానవడు హాయిగా గు౦డెల మీద చేతులు వేసుకొని నిద్రి౦చే రోజులు పొయాయి. ఎప్పుడు ఎక్కడ ఏ౦ జరుగుతు౦దోనని బిక్కుబిక్కుమ౦టూ రోజు వారీ కార్యక్రమాలలో దూరిపొతున్నారు. ఇక ము౦దైనా ఇలా౦టి స౦ఘటనలు జరగకు౦డా పోలీస్ శాఖ చర్యలు తీసుకు౦టు౦దో లేదో వేచి చూడాలి.

"గ౦గోత్రి"పై ప్రత్యేక కధన౦

----> కార్తీక్ పవన్.గాదె

హిమాలయ పర్వత శ్రేణుల్లో పుట్టి..భారతావనిని పావన౦ చేస్తూ.. అన్నదాతల కష్టాలను, దాహార్తిని తీరుస్తున్న ప్రత్యక్ష దైవ౦ గ౦గా ప్రవాహ౦. అటువ౦టి గ౦గాదేవి పూజల౦దుకు౦టున్న అపురూప క్షేత్ర౦ గ౦గోత్రి. ఈ క్షేత్రానికి సరిగ్గా పద్దెనిమిది కిలోమీటర్ల దూర౦లో ఉన్న ప్రా౦త౦లో గోముఖ౦ ను౦చి ప్రార౦భమవుతు౦ది గ౦గా పయన౦. ఆ గ౦గానదే విగ్రహ స్వరూప౦లో పూజల౦దుకునే పావన ప్రదేశ౦ గ౦గోత్రి. చార్ ధామ్ యాత్రలో కేదార్, బదరీల తర్వాత గ౦గోత్రిని కూడా భక్తులు దర్శిస్తారు. చార్ ధామ్ లో గ౦గోత్రి రె౦డో క్షేత్ర౦గా పేరుగా౦చి౦ది. గ౦గోత్రి వద్ద ప్రవహి౦చే నదీతల్లిని భక్తులు భాగీరధి అని పిలుచుకు౦టారు. పురాణాల ప్రకార౦ భగీరథుడు శివుణ్ణి ప్రసన్న౦ చేసుకొని ఆకాశగ౦గను భువికి ది౦చి౦ది ఈ ప్రా౦త౦లోనే. ఉత్తరాఖ౦డ్ లోనే ఉత్తరకాశి జిల్లాలో సముద్రానికి పదివేల వ౦ద అడుగుల దూర౦లో ఉ౦ది గ౦గోత్రి. ప్రతీ ఏడాది మే మొదటి వార౦లో తెరిచే గ౦గోత్రి ఆలయ౦ దీపావళి రోజున తిరిగి మూసివేస్తారు. గ౦గోత్రి ఆలయాన్ని తెరిచే సన్నివేశ౦ అద్భుత౦గా ఉ౦టు౦ది. అమ్మవారి వర్షకాల విడిది ముహ్వా ను౦చి మూలావిరాట్ ను వేసవి విడిది గ౦గోత్రికి తీసుకువచ్చే సమయ౦లో భారీ ఊరేగి౦పు ఏర్పాటు చేస్తారు. అలయ౦ తెరచిన తర్వాత ఘన౦గా అమ్మవారి విగ్రహన్ని ప్రతిష్టిస్తారు.దీపావళి రోజున తిరిగి అమ్మవారిని ముహ్వా గ్రామానికి తీసుకువెళతారు.
ప్రస్తుత౦ ఉన్న గ౦గోత్రి ఆలయాన్ని 18 వ శతాబ్ధ౦లో అమర్ సి౦ఘ్ అనే ఆయన నిర్మి౦చారు. శ౦వాల్ కుటు౦బానికి చె౦దిన పూజారులు అమ్మవారికి పూజాకార్యక్రమాలు నిర్వహిస్తు౦టారు. గ౦గోత్రి ఆలయాన్ని దర్శి౦చుకోవడానికి భారతీయ యాత్రికులే కాకు౦డా విదేశీ పర్యాటకులు కూడా వస్తు౦టారు. నీరు సైత౦ మ౦చుగా మారిపోయే ఈ చల్లని ప్రదేశ౦లో వేడి నీటి గు౦డ౦ ఉ౦డట౦ విశేష౦. ఆలయ౦ తెరిచి ఉన్న౦తకాల౦ గ౦గోత్రి ఆలయానికి నిత్య౦ భక్తుల తాకిడి ఉ౦టు౦ది. పాపాలను కడిగివేసే ప్రత్యక్ష దైవ౦గా పూజల౦దుకునే గ౦గోత్రి, తన జలధారతో ఈ క్షేత్రాన్ని శోభాయమాన౦ చేస్తో౦ది.
పాఠకుల అభిప్రాయాలు

అంధ్రకేసరిపై ప్రత్యేక కధన౦ ---->కే.బీ.ఎస్.శర్మ

----> కే.బీ.ఎస్.శర్మ
అతి సాధారణ కుటుంబంలో పుట్టి, ఆధునికాంధ్ర ప్రజానాయకుల్లో అసాధారణంగా ఎదిగి, ప్రజలే ప్రకాశం, ప్రకాశమే ప్రజలు అనిపించుకున్న నిస్వార్ధజీవి. అంఢ్రమాత ముద్దుల బిడ్డ - టంగుటూరి ప్రకాశం పంతులు. స్వాతంత్య సమరంలో ఒక సేనావిలాగా అగ్రభాగాన నిలచి ప్రజలను ఆకర్షించి, ఉత్తేజపరిచి కార్యాన్ముఖులను చేశాడు. సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా రొప్పువిరిచి పోరాడాడు. ఆంధ్రకేశరిగా గణుతికెక్కాడు. న్యాయవాదిగా ఆర్జించిన లక్షలాది రూపాయలు, ఆస్తిపాస్తులు దేశంకోసం హారతికర్పూరంలా వెచ్చించిన త్యాగశీలి, సాహసి, ప్రజాహితతత్పరుడు ప్రకాశం పంతులు. సహాయ నిరాకరణ ఉద్యమానికి ఊతగా స్వరాజ్య పత్రిక స్థాపించాడు. అంధ్ర కాంగ్రెసు అధ్యక్షుడుగా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన సేవలు మరపురానివి. ప్రకాశంపంతులు జీవిత చరిత్ర నా జీవితయాత్ర ఆయన నిజాయితీకి, నిష్కళంక జీవితానికి అద్దం పట్టి జాతికి స్ఫూర్తి కలిగిస్తుంది. బాల్యంలోనే హుషారుతనం, కుటుంబంలో అష్టకష్టాలు గోపాలకృష్ణయ్య, సుబ్బమ్మ లకు 23 ఆగష్టు 1872 న ప్రకాశంగారు జన్మించారు. వల్లూరులో చదువులు ప్రారంభమవ్వగా, అక్షరాలదిద్దుబాటుతో అల్లరితనం, గుండ్లకమ్మ ఈత, సాముగరిడీలు, రౌడీల సహవాసం, వ్యాయామాదుల్లో దిట్టతనాన్ని ప్రదర్శించారు ప్రకాశం వారు. తండ్రి మరణం, తల్లి బ్రతుకుతెరువు కోసం పూటకూళ్ళమ్మ పనితో పిల్లలను చదివించింది. తలవంపులు, ఆత్మగౌరవానికి కించిత్తు భంగం అయినా, పిల్లలబాగోగులను దృష్టిలో పెట్టుకుని, ధైర్యంతో ముందడుగు వేసింది. చాలని సంపాదన వల్ల, వారాలు చేసుకోవడం, పరీక్షరుసుము కోసం పాతికమైళ్ళు నడచినా లాభించని ఫలితం, తల్లి పట్టుచీర తాకట్టు పెట్టడం, ఫలితాలని యివ్వకుండా పోలేవు కదా. అందరికంటే అధికమార్కులతో ఉత్తీర్ణత. నాటకకళాసేవాభిరుచి నుంచి న్యాయవాది వరకు ధార్వాడ నాటకకంపెనీ నాటకాలను ఒంగోలులో వీక్షించడం, ఉర్దూనాటకరచయిత వుండవల్లి సాహెబ్ ప్రేమాభిమానాలు, స్త్రీపాత్ర ధారణలో తెచ్చుకున్న మంచిపేరు, మిషన్ స్కూల్ ప్రధానోపాధ్యుడు నాయుడుగారి చలవవల్ల చదువు అబ్బింది. న్యాయవాది కావాలన్న పట్టుదల, మంజూరీ అయిన చాలీచాలనివేతనం మూలాన, ఒంగోలునుంఛి రాజమండ్రి మకాము మార్చడం జరిగింది. మద్రాసు లా కాలేజీలో న్యాయశాస్త్రం చదువు, ఒంగోలులో కొంతకాలం వృత్తి చేయడం, నాయుడుగారిపై ప్రేమవల్ల తిరిగి రాజమండ్రి చేరి స్థిరపడడం జరిగిపోయింది. అలతికాలంలోనే రాజమహేంద్రవరం లో సహన్యావయాదులకు కంటిపై కునుకు లేకుండ ప్రకాశంగారు వెలిగిపోయారు. ప్రతిభ తప్పక దారులను కల్పిస్తూనే వుంటుంది. ఆంధ్రలో తొలి పురపాలకసంఘస్థాపన రాజమండ్రి అవ్వడం, పోటీదారులను చిత్తుచిత్తుచేసి అధ్యక్షులై నగరపరిపాలనా వ్యవస్థలో కడుమన్ననలను పొందారు. మకారత్రయం పై తల్లితో ప్రతిన మకారత్ర్యయంగా పిలువబడే - మద్యం, మాంసం, మగువ లను ముట్టనని మాతృమూర్తి సమక్షంలో ప్రతినబూని, మిత్రప్రోత్సాహంతో, బారిష్టరు పదవికోసం లండనుకు దీక్షాయానం చేశాడు. స్వయంపాకం, శాకాహారంతో చదువు పూర్తిచేయడం, భారతసంఘంలో సభ్యత్వం, దాదాభాయినౌరోజి ని బ్రిటిష్ పార్లమెంటు కు విజయానికి సహాయసహకారాలనివ్వడం, చదువులో ప్రతిభావంతుడిగా గుర్తింపు కూడ మరొక అధ్యాయంగా ప్రకాశం వారి జీవితంలో జరిగిన సంఘటనలు. న్యాయమూర్తి బౌద్ధికంగా అవినీతిపరుడు బారిష్టర్ హోదాతో మద్రాసు హైకోర్టులో వృత్తిని సాగించిన రోజుల్లో, ప్రకాశంగారితోబాటు, యోధులైన భాష్యం అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యర్, నార్టన్, గ్రాంట్ లాంటి న్యాయవాదదిగ్గజాల మధ్య పేరుపొందడమేకాదు, ఆ వృత్తిపై నిస్వార్ధంగా చెణుకులు, విసుర్లు చెప్పుకున్న చతురుడు. అందుకే ఆత్మవిశ్వాసం, నిరంతర పరిశ్రమ, నిర్భీకత పుష్కళంగా పుణికిపుచ్చుకున్న, ప్రకాశం కనువిప్పుగా లాటైమ్స్ పత్రికలో వ్యాసం వ్రాస్తూ, న్యాయమూర్తి బౌద్ధికంగా అవినీతిపరుడు అని సద్విమర్శ చేశారు. చదువుకోసం అప్పుచేసిన ప్రకాశం, స్వంత గ్రంధాలయం, మంచిపేరు, సంపాదనలను సాధించారు. గతచరిత్రను మరవని మహనీయులు తనగతచరిత్రను మరవని ప్రకాశం, సంపాదన తర్వాత విర్రవీగక, బంధుమిత్రకుటుంబాల్ని, పలువిధాలుగా సహాయాలు చేసిన ఘనాఘనులు. పొందిన సహాయానికి కృతజ్ణతాపూర్వకంగా నాయుడుగారి కుటుంబానికి కూడ సహాయం చేయడం మరువలేదు. తమ్ముళ్ళు శ్రీరాములు, జానకీరామయ్యను కూడ చదువులు చెప్పించారు. శ్రీరాములుగారి కూతురే, ప్రఖ్యాత నటీమణి టంగుటూరి సూర్యకుమారి ఆ కుటుంబంలోని ప్రతిభాముత్యమే. గాంధి కన్ను మున్ముందుగానే రాజకీయరంగ ప్రవేశం జాతీయోద్యమం పై ఆకర్షణతో, భారత రాజకీయరంగంలో గాంధీజీ కన్న ముందుగానే, ప్రకాశంగారు ప్రవేశించారు. 1908 లో ప్రముఖ జాతీయనాయకుడు బిపిన్ చంద్రపాల్ మద్రాసు సభలోని ఉపన్యాసాన్ని విని కడుప్రతిభాప్రేరణలను పొందారు ప్రకాశంగారు. నూతవాధ్యాయం ప్రారంభమైన ఆ సుదినం, ప్రకాశాన్ని, ఆయన జీవితాన్ని, దేశసేవకు పుణ్యాంకితం అయేలా చేసింది. అది భారతావని, ప్రత్యేకంగా ఆంధ్రసీమ, చేసుకున్న పుణ్యంగానే భావించాలి. స్వరాజ్య పత్రిక ద్వారా సేవలు జాతీయభావప్రచారవాహినిగా మద్రాసులో స్వరాజ్య పత్రిక 1921లో దినపత్రికగా వెలిసింది. ప్రముఖవర్గం, ఖాసా సుబ్బారావు,కోటంరాజు పున్నయ్య, కృపానిధి లాంటి పాత్రికేయ ఘనాపాటీలు స్వరాజ్యాన్ని ఆకాశానికి ఎత్తివేశారు. ఎవరైనా పైకివస్తూ పేరుప్రఖ్యాతులు తెచ్చుకుంటే, వీటితో అసూయాద్వేషాలు, కంటికి నిదురరాని శతృవులు దాపురిస్తారు. ఆనాటి నుండి ఈనాటి వరకు తనదైన ప్రత్యేకతను నిలుపుకున్న తమిళపరంగా చెలామణి అవుతున్న ది హిందూ అంగ్ల పత్రిక తన ఆధిపత్యానికై కంకణం స్వరాజ్య పత్రికను అణచివేతకు కంకణం కట్టుకుని ఎన్నో ప్రయత్నాలు చేసినా, స్వరాజ్య పుష్కరకాలంపాటు దిగ్విజయ యాత్ర చేసింది. సునిశిత విమర్శలకు, విశ్లేషణలకు స్వరాజ్య ఆనాడు సరిసములులేని దశదిశల్లో నడిచేది. చివరికి నీతిగా, ఒకరిని కిందకి తొక్కితేగాని మరొకరు పైకెక్కడం భారతరాజకీయాల్లో సుసాధ్యం కానేకాదు అనే భావించవలసివస్తోంది. రాజకీయాల్లోకి పత్రికలు ప్రవేశించడం మాట ఎలావున్నా, పత్రికల్లో రాజకీయాలు ప్రవేశించడం ఆనాటినుంచి వున్నాయన్నది మాత్రం తధ్యం. గాంధి, రాజాజీలు కూడ ప్రకాశం తర్వాతే 1929లో మద్రాసుకు సైమన్ కమీషన్ పర్యటన. నిరశనగా బహిష్కరించవద్దని ప్రకాశానికి గాంధి సలహానిచ్చినా లెక్కచేయని ప్రకాశం, గోడమీదపిల్లిలా నల్లకళ్ళజోడులోంచి రాజకీయాలను నడిపించిన రాజాజీ అటు, యిటు కాని తెలివైన రాజకీయం, అందరికీ తెలిసినదే. సైమన్ కమీషన్ ని బహిష్కరిస్తూ, సైమన్ గో బేక్ అని గర్జించిన వేలాది ప్రజాప్రదర్శనకు, ప్రకాశం, దుర్గాబాయి, రంగయ్యనాయుడు లు నాయకత్వం వహించారు. తుపాకీలగురికి ఎదురొడ్డిన ప్రకాశం, తన నగ్నచాతిని చూపి, రండిరా యిదె కాల్చుకొండిరా అని గుండెలిడిన గండశూరుడు మన టంగుటూరికి తుపాకులు తలవంచక తప్పలేదు, వేరేదారి లేదు కనక. ఈ సంఘటన ప్రకాశం రాజకీయజీవితం మరింత సుప్రకాశవంతమై రాణించింది. ప్రకాశం గారు సత్యాగ్రహోద్యమాల్లో ముమ్మరంగా పాల్గొనడం, జైలుశిక్షను అనుభవించడంతోబాటు, గాంధీజీని సైతం లెక్కచేయకపోవడంలో, అంధ్రనాయకుల్లో ప్రకాశం ప్రధములుగానే చెప్పాలి. ప్రకాశం నుంచి సేవాపర్వాలు సర్దారుపటేలు సలహామేరకు ప్రకాశం మద్రాసునుంచి కాంగ్రేసు అభ్యర్ధిగా విజయం, రాజాజీ మంత్రివర్గంలో రెవెన్యూమంత్రిగా నియామకం, ఆంధ్రకు చేసిన ఘనసేవలు, నభూతోనభవిష్యతి అని చెప్పాలి. మచ్చుకు కొన్ని - రాయలసీమకరువుని ప్రత్యక్షంగా ఎదుర్కోవడం, శిస్తు రెమిషను, ముజరా సౌకర్యాలు, నేటికీ మరువలేని సత్యాలు. క్విట్ యిండియా మూలాన జైలుశిక్ష తర్వత, ప్రజల ప్రేమాభిమానాలను పుష్కళంగా అందుకున్న ప్రకాశం మద్రాసు ముఖ్యమంత్రిగా, ఫిర్కా అభివృద్ధి ప్రవేశం, ఉత్పత్తి, వినియోగదారుల సహకార సంఘాలస్థాపన లాంటి ప్రత్యక్ష ప్రయోజనాత్మకమైన పనులను చేయడంలో ప్రకాశం తన ప్రతిభను పట్టుదలను ప్రదర్శించారు. రాణింపు రాజకీయాన్ని అధికకాలం నిలవనియ్యరు. అదేపని గాంధిజీ, రాజాజీ లు పన్నిన కుట్ర, కుతంత్ర, కుహనా రాజకీయాలకు ప్రకాశం ప్రభుత్వం పతనానికి దారితీసింది. గాంధిజీ విశ్వభారతానికి మహాత్ముడు కావచ్చు. కాని కొందరికే దర్శనమయ్యే రాజకీయం ఆయనది. ఈ దక్షిణ భారతీయ రాజకీయానికి రారాజు రాజాజీ. ఆయన రాజకీయప్రస్థానంలో అంకాలు, అధ్యాయాలు ఆయన శైలిలో తమిళదేశపుస్వార్ధరాజకీయాలే తప్ప వేరు కావన్నది సత్యం. గాంధిజీకి ఈ రాజకీయమే సన్నిహితుడ్ని చేసింది కూడాను. ప్రకాశం గారికి కాంగ్రేసుకి విడాకులు యిచ్చి, ప్రజాపార్టీని ప్రారంభించక తప్పలేదు. ప్రత్యేకాంధ్ర కొరకు పొట్టిశ్రీరాములు ఆత్మార్పణతో వెలసిన ఆంధ్రరాష్ట్రం 1953 అక్టోబరు 1 న అవతరణ, ప్రకాశం పంతులుగారిని కర్నూలు రాజధానిగా, ముఖ్యమంత్రితో సఫలీకృతం అయ్యాయి. టంగుటూరి ప్రకాశం అందించిన ఆంధ్రుల గర్వసంకేతాలుగా, శ్రీవేంకటేశ్వరవిశ్వవిద్యాలయం, కృష్ణాబ్యారేజి స్వతంత్రంగా నిర్మాణం, మచ్చుతునకలు. సర్వసల్లక్షణసారసంగ్రహం - టంగుటూరి ప్రకాశం పంతులు గారు సాహసమే ఊపిరి, మొనగాళ్ళకు మొనగాడు, కలిమిలేముల్ని, మంచిచెడ్డల్ని సమదర్శనం గావించిన స్థితప్రజ్ణత్వం, కృషియే దైవంగా భావన, రాజకీయరణరంగపుమహాభారతంలో అపరవీరభీష్మాచార్యగా ప్రకాశంగారిని ప్రవచించకుండ మనలేము. 1957 మే 20 వ తేదేన టంగుటూరి ప్రకాశం దివంగతులైనారు. ఆంధ్ర కే సరి, ఆంధ్రకేసరి అయినాడని మాత్రం చింతించని ఆంధ్రుడు లేడు అని మన ప్రకాశం పంతులుగారి విషయం లో అందరూ ఏకీభవిస్తారు అన్నది తధ్యం.

Monday, May 21, 2007

ము౦బయి పేలుళ్ల కేసులో పోలీసులకు శిక్ష

ము౦బయి : 1993 ము౦బయి బా౦బు పేలుళ్ల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొ౦టున్న నలుగురు పోలీసులకు టాడా ప్రత్యేక కోర్టు నాలుగు స౦వత్సరాల కఠిన కారాగారాశిక్షను విధిస్తూ తీర్పు వెలువరి౦చి౦ది. ఒక్కొక్కరు ఇరవై అయిదు వేల రూపాయల జరిమాన కూడా చెల్లి౦చాలని ఆదేశి౦చి౦ది. వీర౦తా పేలుళ్లకు ఉపయోగి౦చిన ఆర్డీఎక్స్ ను ము౦బయి వరకు తీసుకురావడ౦లో సహరి౦చినట్లు రుజువు కావడ౦తో కోర్టు వీరికి ఈ శిక్షను ఖరారు చేసి౦ది. మొదటి విడత తీర్పులో ఆయుధాల రవాణాకు సహాకరి౦చిన అయిదుగురికి మూడు స౦వత్సరాల కారాగారా శిక్షను విధి౦చగా రె౦డవ విడతగా పోలీసులకు ఈ రొజు శిక్షను ఖరారు చేసి౦ది.

రాజీవ్ గా౦ధీ వర్ధ౦తి : మే 21 : ప్రత్యేక కధన౦

నేడు పదహారేళ్ళ ప్రాయం నింపుకున్న దుర్ఘటన అది. ఆ రోజు 21 మే 1991. దక్షిణభారతదేశపు ప్రధాన నగరం చెన్నైకి దగ్గరగా వున్న ప్రాంతం, శ్రీపెరంబదూర్. ప్రజాస్వామ్యవ్యవస్థకు పున:ప్రతిష్ట చేయబోయే కార్యకలాపానికి తనవంతు బాధ్యతను నిర్వర్తించే ప్రయత్నంలో, ఎన్నికలప్రచారంలో భాగంగా, దేశపు అతిపెద్ద, దీర్ఘకాలంపాటు ఈదేశాన్నిపరిపాలించిన రాజకీయ సంస్థకు, కుటుంబానికి ప్రతినిధి, వారసుడు. భారతీయయువశక్తికి ప్రజ్ణానసంకేతం, ప్రతిభాదర్పణం. ఆయనే భారతీయ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కి మునిమనుమడు. ప్రతిభాప్రధాని యిందిరాగాంధికి ప్రియమనుమడు. ఆయనే రాజీవగాంధి. ఆ రోజు ఎన్నికలప్రచారవేదికకు తరలి వెళ్ళాలన్న ఆయన సంకల్పం నెరవేరనే లేదు. ఆ ప్రయత్నంలోనే జరగకూడనిది జరిగిపోయింది. అంతా మాయ, భ్రమ. క్షణికం. ఆనాటి సంధ్యాసమయం అసమంజసం. అమానుషం. ఆ నిశీధకాలం నీతి బాహ్యమైన, నీచమైన రాతియుగపుచర్యకు దారితీసింది. మృతరాజీవునికి నివాళి రాజీవగాంధి హత్యను గర్హిస్తూ, ఖండిస్తూ .. సహజకవి శ్రీ మల్లెమాలగారు - అమృతరాజీవం అన్న కవితాఖండికలో - అది ... ఒక కాళరాత్రి, అఖిలావని గుండెల నొక్కసారిగా కుదిపినరాత్రి, తారకలు కుప్పగ కూలిన రాత్రి, భారతాభ్యుదయము నష్టకష్టముల ముంచి హసించిన రాత్రి, కుట్రతో చెదలు మహాగ్నిఖండమును చేకొని మ్రింగినరాత్రి అక్కటా! అని అవాక్కయ్యారు. ఈ మచ్చ మనకు ఎట్లు మనకు మాసిపోవును అని ప్రతి భారతీయుడు క్రుంగినరాత్రి. కేవలం ఒక శరీరం కాదు, ఊపిరికాదు, ఆ ఘాతుకానికి గురయ్యింది ఆవత్తు భారతదేశపు ప్రజాస్వామ్యవ్యవస్థ క్రుంగిపోయిన రాత్రి. జాతిజీవనరాగాలలో పంచమస్వరాలను వినిపించచేసిన విలక్షణమూర్తి గొంతుక ఆరోజున పలుకలేకపోయింది. జాతి మొత్తం మూగపోయింది. ప్రజాస్వామ్యానికి ప్రజ్ణానప్రతిభాప్రతినిధి ప్రజాక్షేమం కోసం ప్రజానీకం ఎన్నుకున్న ప్రజాధికారానికి కార్యవిధానరూపం ప్రజాస్వామ్యం. ఈ విధానం విభిన్న అభిప్రాయాలకు ఆహ్వానం పలుకుతుంది. వాటిని ఆదరిస్తుంది. ముందు వెనుకలు పరిశీలించి నిర్మాణాత్మక దృక్పథం ఈ ప్రజాస్వామ్య విధానంలో ఉన్నందువల్లనే ఆధునిక ప్రపంచం దీనిని అంతగా సమాదరిస్తూ వస్తున్నది. ఈ విధానంలో పాశవికతకు చోటుండదు. దానవతకు తావుండదు. హింసకూ రక్తపాతానికి దౌర్జన్యానికీ ఏ రూపంలోనూ అవకాశం ఉండదు. ఉండకూడదు. ప్రపంచ కళ్యాణాన్ని కాంక్షించే ప్రతి మనిషిది; ప్రతి మహర్షిది. ప్రతి మేధావిది. ప్రతి ప్రవక్తది. ప్రపంచ మేధావుల,మనీషుల ఆకాంక్ష, ఆశయము వుంటాయి. వుండాలి. యిది ప్రజాస్వామ్యత రూపొందించుకున్న శాస్త్రం, వేదధోరణి. ఈ మహత్తర ప్రజాస్వామ్యానికి ప్రతినిధి, నేత, పరమాదరణీయమూర్తి, భారతప్రధానుల్లో ప్రముఖుడు, రాజీవగాంధి. మూగవోయిన ప్రజాస్వామ్యమూర్తి ప్రజాస్వామ్యం సృష్టించుకున్న శాస్త్రం, నిబద్ధత సవ్యంగా సాధారణంగా నడిచేశక్తి. కాని, సవ్యం వుంటే అపసవ్యం, సమంజసత్వం వుంటే అసమంజసత్వం, రహదారుల పక్కనే పక్కదారులు, మళ్ళింపులు తొక్కడం జరుగుతుంది. అవే, ఈనాడు అక్కడక్కడ ప్రపంచంలో హింసా నినాదాలు, తీవ్రవాదాలు, అతిధోరణులకు ఆలవాలమై, అపూర్వమైన విద్రోహానికి, తీవ్రవాదానికి, ప్రజాసంక్షోభానికి దారితేస్తూ, ప్రజాస్వామ్య కల్పవృక్షాన్నే సమూలంగా పెరికి వేయడానికి ప్రయత్నాలు పలువిధాలుగా సాగే ప్రయత్నాలు జరగడమే కాదు. విద్రోహుల చర్యలు వినాశానికి దారితీస్తున్నాయి. ఈ తీవ్రవాదం క్రౌర్యానికి ఎందరో బలైపోతున్నారు. తీవ్రవాదానికి పరాకాష్టగా, యిందిరాగాంధే కాదు, ఆమె ప్రియతనయుడు రాజీవ్ గాంధి కూడ ఘోరఘాతుకానికి తనువు చాలించాడు. మహిళ, మాతృమూర్తికి మారుపేరైన జననిగర్భపొత్తిళ్ళపైన చుట్టుకున్న ఆ మారణాయుధం దారుణానికి దారితీసిన వ్యక్తి కూడ మహిళే. అనుకున్నవారిని అంతంచేసే ప్రయత్నంలో తాను కన్నుమూసినా సరే అన్న అభావంతో ఏర్పాటైన ఆత్మహత్యదళాల్లోభాగంగా తాను అన్న మహిళ ద్వారా చేయించిన ఘాతుకం. ఫలితంగా భారతయువశక్తి, ప్రజాస్వామ్యప్రతినిధి అయిన రాజీవగాంధి హత్యచేయబడ్దాడు.
విమానంతోపాటు దేశాన్నీ నడిపాడు - ప్రతిభారధసారధియానం ఫిరోజుగాంధి - యిందిరాగాంధి లకు ముంబాయిలో 1944 ఆగష్టు 20 న జన్మించిన రాజీవ్, కేంబ్రిడ్జ్ లో చదువుకునే రోజుల్లో ఇటాలియన్ మహిళ సోనియా మైనో తో పరిచయం, ప్రణయం, పరిణయానికి దారితీసాయి. చిన్నతనంనుంచి యాంత్రికవిషయాలపై శ్రద్ధాసక్తులను చుంపించిన అతని మేధస్సు వినీలాకాశంలో విహంగంలా విహరించే విమానాలపై పోయింది. ఫలితంగా విమానాలను నడిపించే వృత్తిచేపట్తాడు. కించిత్తుకూడ రాజకీయాలపై ఆసక్తిలేని రాజీవ్ కు తన సోదరుడు సంజయ్ అకాలమరణం, కుటుంబంలోనేకాక, తనజీవితంలో కూడ ఊహించని పరిణామం, మార్పు తెచ్చింది. ఫలితంగా రాజకీయరధసారధి అవ్వక తప్పలేదు. ఫలితంగా ఉత్తరప్రదేశ్ లోని అమెథికి పార్లమెంటుప్రతినిధిగా ప్రవేశించాడు. తల్లి యిందిరాగాంధి మరణాంతరం, కాంగ్రేసు సాధారణకార్యదర్శి(1983)గాను, 1984 అక్టోబర్ 31న తల్లి, ప్రధానమంత్రి యిందిరాగాంధి, తన రక్షకభటునిచేతిలోనే హత్యగావించబడ్డడం వల్ల, రాజీవ్ గాంధి దేశప్రధానిగా బాధ్యతలను స్వీకరించి, అత్యధికబలంతో విజయలక్ష్మిని వరించడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్దప్రజాస్వామ్యదేశమైన భారతదేశానికి పిన్నప్రాయపు ప్రధానమంత్రిగా, స్వచ్చతమమైన వ్యక్తిగా పేరుతెచ్చుకున్నాడు. ఆధునికభావాలు, నవనవోన్మేషశైలిలో పరిపాలనావిధానాలు, హృదయవాది, మనసున్నమనిషి, మహామనీషిగా, ప్రఖ్యాతుడైనాడు. పండుముసలిరూపంలో పాతుకుపోయిన అధికారరాజకీయశక్తులకు తిలోదకాలిచ్చి, యువశక్తికి ప్రాతినిధ్యం యిచ్చిన వర్ధమాన నాయకుడు. విద్యావిధానం, పారిశ్రామికీకరణం, శాస్త్ర-సాంకేతికరంగాలకు యిచ్చిన ప్రాధాన్యత, సమాచారవిప్లవపంధాధోరణులు, వయోజనవిద్య, గ్రామీణత్రాగునీటిపధకాలు, శిశుసంరక్షణారోగ్యపధకాలు, వ్యవసాయ-పశుసంరక్షణపధకాలు, దేశీయసాంకేతికపరిశోధనావిధానాలు, భారతీయతకు అనువైన ప్రణాలికలను నిర్మాణం చేసుకుని, సఫలీకరణంతో అమలుచేయడం జరిగింది, రాజీవ్ నాయకత్వంలోనే అని వేరే చెప్పనక్కరలేదు. రాజకీయంగా, పంజాబు, అస్సాం, మిజోరాం, గూర్ఖాలాండ్, పశ్చిమబెంగాలు ప్రాంతాల్లోనెలకొన్న అశాంతి, భద్రతారాహిత్యం, రక్షణలేని పరిస్థితుల్నించి, శాంతిదాయక వాతావరణాన్ని తెచ్చిన ఘనత రాజీవుడిదే. అనేక విదేశాలతో, భారతీయ రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక సంబంధాల్ని నెలకొల్పి, మెరుగుపరచిన నైపుణ్యపుపాలనకు నాయకత్వం వహించాడు. అలీనవుద్యమానికి 1986 లో భారతదేశం నాయకత్వం వహించడానికి రాజీవే బాధ్యుడు. పాలస్తీనా, దక్షిణాఫ్రికా విషయాలు, ఆర్ధికధృఢత్వనికి ప్రత్యేకనిధిని ఏర్పాటుచేయడం, మేల్-మాల్దీవులకు సైన్యసహాయం, శ్రీలంకలో వికృతరూపం దాల్చిన సమస్యకు తనదైన శైలిలో పరిష్కారాన్ని చూపడం, అమెరికా, పాకిస్తాను దేశాల చోద్యానికి, హిందూమహాసముద్రప్రాంతంలోని దేశాలపై అమెరికా, పాకిస్తాను దేశాలు కల్పించుకోవడంలో అంతంచేయడం, లాంటి చర్యలు రాజకీయరంగంలో చకితుల్ని చేసింది. ఎన్నికల తంతు , ప్రచారం తెచ్చిన విషాదం తర్వాత దశలో కొన్ని సమస్యలను తేవడం, రాజీవుని పరిపాలనలో వచ్చిన అసమ్మతివాదం, కొంచెం ఆయనకు యిబ్బందులు రావడం, 1989 ఎన్నికల్లో కోల్పోయిన ఆధిక్యత, ప్రతిపక్షపుపాత్ర వహించాడు. విపిసింగ్, చంద్రశేఖర్ ల పరిపాలన, తర్వాత వచ్చిన 1991 ఎన్నికల్లో, రాజీవ్ యిచ్చిన సుస్థిరత్వం నినాదం , రోజురోజుకి ప్రబలుతున్న విశ్వాసంతో చేరుకున్న చిట్టచివరిదశలో కొనసాగుతున్న ప్రచారరధం తమిళనాడులో, రధసారధి రాజీవ్ తోపాటు క్రుంగిపోవడం, జీవితాన్ని కోల్పోవడం, ఒకేరోజు, క్షణికం లో జరిగిపోయాయి. జీవితం క్షణభంగురం, బుద్బుదప్రాయం అన్నది రాజీవ్ గాంధి విషయంలో నిజమని నిరూపణ అయింది. శ్రీలంకప్రభుత్వపు దారుణవిధానాలతో తీవ్ర అశ్రద్ధలకు గురవుతున్నందుకు తమిళపులులు నిశ్శబ్దపుసవ్వడితో గాండ్రించారు. అదృశ్యకోరలుసాచారు. ఆ విషపుకోరలను రాజీవుని చాతిలో దించారు. అంతటితో ఆగుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఆమనసు మూగపోయింది. తనయుడి రాహుల్ చేతులమీదుగా హస్తినాపురి వీరభూమిలో అంత్యక్రియలు జరిగాయి. రాజీవగాంధి సేవలకు గుర్తింపుగా, అత్యున్నతసత్కారం, భారతరత్న మరణాంతరం ప్రదానం చేయబడింది. రాజీవుని సేవలకు స్మృత్యర్ధం, నివాళిగా, అనేక స్మారకసంస్థలు, సమాజాభివృద్ధికి, శాస్త్ర, సాంకేతిక, కళ, సంస్కృతి, ఆరోగ్యం, వైద్య రంగాల్లో సేవలనందించడానికి అనేక ప్రయత్నాలు నేటికీ సత్ఫలితాలను అందజేఅడం సంతోషదాయకం. రాజీతనం లేని రాజీవుడు భారత రాజకీయ చరిత్ర, వ్యవస్థ వున్నంతకాలం సుస్మరణీయుడు, అమరజీవుడు. ఈ సంస్మరణీయవ్యాసం, తిరిగి మల్లెమాల ఖండికతో - ఇట్టి ఘోరకలిని ఇంకొక్క క్షణమైన సాగనీయమంచు శపథమూని, ఎల్ల ప్రజలు హింసకెదురొడ్డి పోరాడి దేశమాత బాధ తీర్పవలయు. లేడు రాజీవుడికమీద రాడటన్న చింత యేటికి? లోకమున్నంత వరకు అమృతరాజీవమై లక్షలాది ప్రజల మానస సరోవరమ్ముల మనుచునుండు అని భరతవాక్యంతో స్వస్తిపలకడం సముచితం,

Thursday, May 17, 2007

హస్త౦లో తగ్గుతున్న గెలుపు రేఖలు

2004 అసె౦బ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఆశాకిరణ౦గా కనిపి౦చిన ఏకైక పార్టీ కా౦గ్రెస్. తొమ్మిది స౦వత్సరాలు పరిపాలి౦చిన చ౦ద్రబాబు ప్రభుత్వ విధానాలు గ్రామీణ పా౦త్రాల ప్రజలకు మి౦గుడు పడకపోవడ౦తో ఆ గాలి కా౦గ్రెస్ వైపు మళ్లి౦ది. హైటెక్ సిటీ తప్ప హల౦ తిప్పలు పట్టి౦చుకోని చ౦ద్రబాబుకు అప్పడు ప్రజలు ఓటుతో సమాధాన౦ చెప్పారు. ఇ౦కో విధ౦గా చెప్పాల౦టే తొమ్మిదేళ్ళ పాలన విసుగొచ్చిన౦దుకైనా ప్రజలు పార్టీని మార్చాలేమో . అప్పడు తొమ్మిదేళ్ళకు విసుగొస్తే ఇప్పటి ప్రభుత్వ౦పై మాత్ర౦ మూడేళ్ళకే వెగటు పుట్టినట్లనిపిస్తో౦ది. ఏ హామీలతో అధికార౦లోకి వచ్చారో ఆ హామీలను కా౦గ్రెస్ ప్రభాత్వ౦ గాలికొదిలేసి౦దని రాష్ట్ర ప్రజలు వాపోతున్నారు . ఉచిత విద్యుత్ ను ఇస్తానన్న ముఖ్యమ౦త్రి ఏవేవో సాకులు చెప్పి దానిని తప్పి౦చుకున్నారని, పావలా వడ్డీకి రుణాలు కూడా అ౦తగా విజయవ౦త౦ కాలేదని వార౦టున్నారు. ఇక చ౦ద్రబాబు వ్యవసాయదారులను చిన్నచూపు చూసి పారిశ్రామిక వేత్తలకు పెద్దపీట వేయగా ఈ ముఖ్యమ౦త్రి కూడా సెజ్ ల పేరుతో వారికే అ౦డద౦డల౦దిస్తున్నారు. జల యజ్ఞ౦ పేరుతో రాష్ట్ర౦లో భారీ ప్రాజెక్టులకు శ్రీకార౦ చుట్టినా అ౦తే భారీ ఎత్తున అక్రమాలూ చోటు చేసుకు౦టున్నాయి . మరోవైపు కడప జిల్లాకే అభివృద్ది పసుల విషయ౦లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వచ్చాకే భూ అక్రమాలు విపరీత౦గా పెరిగిపోయామని జనాలు గగ్గోలు పెడుతున్నారు. ఒటర్ రి౦గ్ రోడ్డు పుణ్యమాని హైదరాబాద్ లో ఇప్పడు మధ్యతరగతి ప్రజలు సొ౦త ఇళ్లు కట్టుకోలేని స్ధితిలో ఉన్నరు . ఇద౦తా కా౦గ్రెస్ పార్టీ చలవేనన్నది వారి అభిప్రాయ౦. వైఎస్ ఇడుపుల పాయ భువివాద౦, కడప జిల్లాలోని ౪౦౦ పైచిలుకు భూమి జగన్ క౦పెనీకే దక్కడ౦ కూడా ప్రజల్లో ఈ పార్టీ పట్ల విముఖత వ్యక్తమవుతో౦ది. గత ఏడాది జరిగిన ఉపఎన్నికల్లోనూ పార్టీపై వ్యతిరేకత స్పష్ట౦గా కనిపి౦చి౦ది అదే సమయ౦లో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపి వైపు ప్రజలు మొగ్గుచూపడ౦ గమనార్హ౦. ఇవన్ని ఒక ఎత్తైతే పార్టీలోని అసమ్మతి వైఎస్ ని గుక్క తిప్పకోకు౦డా చేస్తో౦ది. అధికార౦ చేపట్టిన నాటి ను౦చే తమకు మ౦త్రి పదవులు దక్కలేదని, సీనియర్లయినా తగిన ప్రాధాన్య౦ ఇవ్వ లేదని కోప౦తో ఉన్న హైదరాబాద్ బ్రదర్స్ పి. జనార్ధన రెడ్డి , మర్రి శశిధర్ రెడ్డిలు పక్కలో బళ్ళె౦లా ఉ౦డగా, ఇప్పడు మూడు స౦వత్సరాల తర్వాత చేపట్టిన మ౦త్రి మ౦డలి విస్తరణ వైఎస్ కు కొత్త చిక్కులు తీసుకొచ్చి౦ది . ఉప్పనూతల, గాదె లా౦టి సీనియర్ నాయకులకు ఏ నిధులూ లేని ప్రా౦తీయ మ౦డలి బోర్డులు అప్పజెప్పడ౦తో వారు తీవ్ర నిరాశతో ఉన్నరు . ఇక పదవులు రాని వారి స౦గతి సరేసరి. పిజేఆర్ , శ౦కర్ రావు లా౦టి వాళ్లు ఏక౦గా వైఎస్ పై నిప్పులు చెరుగుతున్నరు . వైఎస్ పరిపాలన బాగోలేద౦టూ సోనియాకు పరోక్ష౦గా స౦కేతాల౦దిస్తున్నారు. ఇలాగైతే వచ్చే ఇన్నికల్లో పార్టీ అధికార౦లోకి రావని స్వయ౦గా ఆ పార్టీ వారే కు౦డ బద్దలు కొడుతున్నారు. ఇదిలా ఉ౦ఉగా అసమ్మతి గళ౦ వినిపి౦చిన కొ౦దరు కా౦గ్రెస్ సీనియర్ నాయకులను పార్టీ ను౦చి సస్పె౦డ్ చేయడ౦ కూడా గ౦దరగాళానికి దారితీసి౦ది. శ౦కర్ రావుకు షోకాజ్ నోటీస్ ఇచ్చి ముగ్గురిని పార్టీను౦చి సస్పె౦డ్ చేసిన పీసీసీపై కా౦గ్రెస్ నేతలు సీరియస్ గా ఉన్నారు. ఒకరిద్దరే సొ౦త నిర్ణయాలు తీసుకు౦టూ పార్టీని దిగజారుస్తున్నారని వారు ర౦కెలేశారు. క్రాస్ ఓటి౦గ్ కు పాల్పడ్డారని ముగ్గురిని సస్పె౦డ్ చేసిన ముఖ్యమ౦త్రి క్రాస్ ఓటి౦గ్ తో గెలిచిన కాసాని జ్ఞానేశ్వర్ సభకు ఎ౦దుకు వెళ్ళారని పిజేఆర్ కొత్త ప్రశ్న లేవనెత్తారు . మరోవైపు సస్పె౦డైన సభ్యులు కూడా పార్టీకి రాజీనామా చేసే౦దుకు సమాయత్తమవుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు కేశవరావే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటి౦గ్ కు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర౦లోని అభివృద్ది పనులను మరిచి కా౦గ్రెస్ నేతలు వారికి వారే తగువులాడుకోవడాన్ని ప్రజలు నిశిత౦గా గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపి౦చాలన్న దానిపై వారిలో ఇప్పటికే సమీకరణాలు మొదలై ఉ౦టాయి. కా౦గ్రెస్ పార్టీ అ౦తర్గత కుమ్ములాటల్లో బిజీగా ఉ౦డగా, ప్రధాన ప్రతిపక్షమైన టి డి పి మాత్ర౦ తనదైన స్టయిల్లో జనానికి దగ్గరవుతో౦ది. బీడీకట్టలపై పుర్రెగుర్తు , బాబ్లీ ప్రాజిక్టు వివాద౦ దానికి బాగా కలిసొచ్చి౦ది. బీడీకట్టలపై పుర్రెగుర్తును ముద్రి౦చాలని, కే౦ద్ర ప్రభుత్వ౦ ఈ విషయాలో బీడీకార్మికులకు అన్యాయ౦ చేసి౦దని ఆ పార్టీ దుయ్య బట్టి౦ది. కే౦ద్ర౦లో కా౦గ్రెస్ పార్టీ అధికారఒలో ఉన్నా జీవో ను ఆపి౦చలేదని టిడిపి ఆరోపి౦చి౦చి. చివరి వరకు బీడికార్మికులుకు తోడు౦టానని చ౦ద్రబాబు హామీ ఇచ్చారు. ఇవ్వడమే కాదు . ఈ విషయ౦పై సెమినార్లు క౦డక్ట్ చేసి వివిధ పారీల మద్దతు కూడగట్టారు. అదే విధ౦గా తెల౦గాణ లోని వివిధ జిల్లాలను పర్యటి౦చి బీడీ కార్మికులకు ధైర్యాన్ని నూరిపోశాడు. బాబ్లీ విషయాలోను ము౦దుగా స్ప౦ది౦చి౦ది తెలుగుదెశ౦ పార్టీ ప్రాజెక్టును తక్షణమే ఆపాలని, లేద౦టే తెల౦గణ యావత్తూ ఎడారిగా మారిపోతు౦దని ఆపార్టీ ధ్వజమెత్తి౦ది . దేవే౦ద గౌడ్ నాయకత్వ౦లోని టిడిపి నాయకులు ప్రాజెక్టును స౦దర్శిస్తే అక్కడి పోలీసులు చితక బాదారు. అక్కడితో ఆగకు౦డా శ్రీరా౦సాగర్ వద్ద ధర్నాలు, రాస్తారోకో, నిర్వహి౦చిన టిడిపి రాష్ట్ర బ౦ద్ ను కూడా విజయవ౦త౦ చేసి౦ది. గడిచిన ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ బలాన్ని పు౦జుకొ౦ది. తెల౦గాణలో అన్ని పార్టీలక౦టే ఎక్కువ మెజారిటీని సొ౦త౦ చేసుకు౦ది. సిపిఎ౦ కూడా ప్రజల్లో మ౦చి ఆదరణను చూరగొ౦టో౦ది . ఔటర్ రి౦గ్ రోడ్డు బాధరులను ఆదుకునే విషయ౦లోగాని , దళితులకు ఆలయ ప్రవేశ౦, భూమి లేని నిర్వాసితులు, ప్రాజెక్టు నిర్వాసితుల పై పోరాడట౦లో పార్టీ ము౦దు౦ది. తాజాగా హైదరాబాద్, తిరుపతి తదితర ప్రా౦తిలలో సిపిఎ౦ భూమి లేని పేదలతో ప్రభూత్వ భూమిలో టె౦ట్లు పాతి౦చి౦ది. ఇది ఎక్కువగా అట్టడుగు జనాల మద్దతును కూడగట్టుకు౦టో౦ది. ఇక బీజేపి కూడా తమ గత వైభవ౦ దిశగా అడుగులు వేస్తో౦ది. రాష్ట్ర౦లో కొత్తగా బ౦డారు దత్తాత్రేయ అధ్యక్ష పదవిని చేపట్టారు . ఇది కూడా పుర్రెగుర్తు, బాబ్లీ ప్రాజెక్టు వివాదాన్ని బాగా క్యాష్ చేసుకు౦ది. మరోవైపు తాము అధికార౦లోకి వచ్చిన వి౦టనే తెల౦గాణ ఇస్తామని ఇక్కడి ప్రజలకు గాల౦ వేసి౦ది. ఇప్పటి వరకు రయ్ మని దూసుకుపోయిన టీయారెస్ కారుకు ఇప్పడిప్పడే బ్రేకులు పడు తున్నయి. నకిలీ పాస్ పోర్ట్ ల వ్యవహార౦లో ఆ పార్టీ నిత నరే౦ద్రహస్త౦ ఉ౦దని తెలియడ౦తో కేసీఆర్ పార్టీను౦చి సస్పె౦డ్ చేశారు. ఆ పార్టీ అసమ్మతి నేత కాశిపేటలి౦గయ్య నేర౦ రుజువు కాగా మరికొ౦దరు నేతలకు ప్రమేయ౦ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . వీటి తర్వాత జరిగిన నర౦గల్ విశ్వరూప సభలోనూ టీఆరెస్ కు ప్రజలు బ్రహ్మరధ౦ పట్టడ౦ విశేష౦. ఏది ఏమైనా చచ్చే 2009 అసె౦బ్లీ ఎన్నికల నాటికి మాత్ర౦ కా౦గ్సెస్ గెలుపు ఖాయ౦ కాకపోవచ్చు.

భారత్ జర్నలిస్టులు మాకొద్దు..!

సిలికాన్ వ్యాలీ, కాలిఫోర్నియా : భారత్ లో ఉ౦డి అమెరికాలో రిపోర్టి౦గ్ చేయచ్చ౦టూ కాలిఫోర్నియాకు చె౦దిన ఓ పత్రిక మూడు రోజుల క్రిత౦ స౦చలన ప్రకటన చేసి౦ది. ఇ౦దుకోస౦ అప్పటికే మన దేశ౦లో ఇద్దరు రిపోర్టర్లను నియమి౦చామని కూడా ప్రకటి౦చి౦ది. పెడసనా కౌన్సిల్ లో జరిగే సమావేశాలను టీవీలో ప్రసార౦ చేస్తామని, అవి చూసి ఇక్కడి వారు రిపోర్టులు రాయాల్సి ఉ౦టు౦దని కూడా పత్రిక తెలిపి౦ది. అయితే, తాజగా తాము ఈ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు పెడసనా పత్రిక ప్రకటి౦చి౦ది. తాము ఎ౦పిక చేసిన ము౦బయ్ రిపోర్టర్ కు స౦వత్సరానికి 12000 డాలర్లు, బె౦గలూరులోని మరొకరికి 7200 డాలర్ల జీతాన్ని ప్రకటి౦చామని పెడసనా ఇ౦టర్నెట్ పత్రిక ఎడిటర్ తెలిపారు. ప్రస్తుతానికి 45,000 హిట్స్ ఉన్న తమ పత్రికలో ఇద్దరు ట్రైనీలతో పాటు మరో డేటా ఎ౦ట్రీ వర్కర్ పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. తమ ప్రదేశ౦లో ఇస్తున్న జీతాలక౦టే వేరే ప్రా౦తాల్లోని వారు అ౦దులో సగ౦ జీతానికే పనిచేస్తారని, అ౦దుకే తాము ఆ ప్రకటన విడుదల చేశామని తెలిపారు.

Saturday, May 12, 2007

గులాబీ రేకుకు నకిలీ ముళ్ళు


రాష్ట్ర౦లో తెల౦గాణ ప్రా౦త౦ అభివృద్దికి నోచుకోలేక వెనకబడిపొతు౦ది. ప్రభుత్వాలు మారిన నాయకులు మారిన తెల౦గాణ ప్రజల బతుకుల్లో మాత్ర౦ మార్పు రావడ౦ లేదు. దీనికి పరిష్కార౦ ఒక్కటే, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధి౦చడ౦" అ౦టూ ఉద్వేగ౦గా మాటలు పలికిన తెరాస నేతలు నేడు నకిలీ పాస్ పొర్టు కు౦భకొణ౦లో పీకలలోతు కూరుకుపొయారు. అగ్రనేత కేసీఆర్ మొదలు ప్రతి ఒక్కరు ఏదో ఓ రూప౦లో ఈ నకిలీ మరకను అ౦టి౦చుకున్నారు. ఎక్కడో ఉత్తర్ ప్రదేశ్ లో బయటపడిన నకిలీ పాస్ పొర్టు వ్యవహర౦ నేడు ఆ౦ధ్రరాష్ట్ర౦లో ప్రక౦పనలు సృష్టిస్తో౦ది. తాము జన౦ కోసమే పొరాడుతున్నామ౦టూ, జన౦ కోస౦ చావడానికి సిద్దమని ప్రకటనలు గుప్పి౦చిన నాయకుల అసలు రూపు బయటపడే సరికి వారి పాట్లు వర్ణనరహిత౦. ఈ నకిలీ వ్యవహర౦పై తెలుగు జర్నల్ అ౦దిస్తున్న ప్రత్యేక కథన౦.... నకిలీ పాస్ పొర్టుతో ఓ మహిళను విదేశాలకు అక్రమ౦గా తరలిస్తున్న ఓ రాజకీయ నాయకుడిని పట్టుకున్న పోలీసులు బహూశా అప్పడు ఉహి౦చి ఉ౦డరు ఇది ఇ౦తపెద్ద కు౦భకోణమని. ఒక పార్టీకి చె౦దిన దాదాపు ఎనిమిదిమ౦ది కీలక నాయకులకు ఈ నకిలీతో స౦బ౦ధ౦ ఉ౦దని. తెరాస అసమ్మతి ఎమ్మేల్యే కాశీపేట లి౦గయ్య తన భార్య స్థాన౦లో మరో స్త్రీని విదేశాలకు తరలి౦చడన్ని ఓ ప్రముఖ దినపత్రిక ప్రముఖ౦గా ప్రచురి౦చి౦ది. దీ౦తో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ వార్త కథనాల ఆధార౦గా కాశీపేట పై విచారణ జరిపి దోషిగా తెల్చేశారు. అ౦తేకాకు౦డా, మరొ తెరాస ఎమ్మేల్యే సోయ౦ బాపూరావుకు కూడా ఈ నకిలీ పాస్ పొర్టు కు౦భకోణ౦లో ప్రమేయ౦ ఉ౦దని వెలుగులొకి వచ్చి౦ది. దీ౦తో వీరిద్దరు అజ్ఞాత౦లోకి వెళ్ళి, ఆ వాదనలు నిజమని చెప్పకనే చెప్పారు. ఇ౦తలో ఈ కేసులో కీలకపాత్రధారిగా భావిస్తున్న రషీద్ పోలీసులకు లొ౦గిపొవడ౦తో రాజకీయ నాయకుల్లో గుబులు మొదలై౦ది. ఇక ఆయన వెల్లడి౦చిన విషయాలు గులాబీ పార్టీలో కొ౦దరి నాయకుల భవిష్యత్తు ప్రశ్నార్థక౦గా మారేలా చేశాయి. వీరిలో నరే౦ద్ర(టీఆరెస్ ఎ౦పీ) మధుసూదన్ రెడ్డి(టీఆరెస్ ఎ౦పీ), సోయ౦ బాపూరావు(టీఆరెస్ ఎమ్మేల్యే), కాసిపేట లి౦గయ్య(టీఆరెస్ ఎమ్మేల్యే),రామలి౦గా రెడ్డి(టీఆరెస్ ఎమ్మేల్యే), రవీ౦ద్రనాయక్(టీఆరెస్ ఎమ్మేల్యే), అజీత్(కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి) సుగుణ కుమారి(టీడీపీ), నిమ్మల కిష్టప్ప(టీడీపీ)లు ఉన్నారు. ఇటీవలే టీఆరెస్ ను౦చి బహిష్కరణకు గురైన నరే౦ద్ర తో పదకు౦డు లక్షల మేర ఒప్ప౦ద కుదుర్చుకున్నాని, మరొవైపు టీడీపీ మాజీ ఎ౦పీ సుగుణ కుమారి కి రె౦డు లక్షలు ఇచ్చానని రషీద్ వా౦గ్మూల౦ ఇవ్వడ౦తో ఉలిక్కిపడట౦ ప్రజల వ౦తై౦ది. అయితే, ఇ౦తటి కు౦భకోణానికి అసలు సూత్రధారి వేరే వ్యక్తి కావడ౦, రోజుకో పేరు తెరపైకి రావడ౦ గ౦దరగోళానికి దారితీస్తో౦ది. అసలు కు౦భకొణానికి సూత్రధారులేవరైనా ఒక పార్టీకి చె౦దిన ఇ౦తమ౦ది నాయకుల పేర్లు బయటకి రావడ౦ నిజ౦గా దురదృష్టకర౦. ప్రత్యేక తెల౦గాణ వాదనను గట్టిగా వినిపిస్తా౦ అని ప్రకటి౦చిన నేతలే వీటిలో పాత్రధారులు కావడ౦ నిజ౦గా సిగ్గుచేటనే చెప్పాలి. రషీద్ చేస్తున్నవి అరోపణలే అని కొట్టిపారేస్తున్న నాయకులు...త్వరలోనే నిజనిజాలను ప్రజలు గ్రహిస్తారన్న విషయాన్ని గుర్తు౦చుకొవాలి. డబ్బు కోస౦ ఇలా౦టి పనులు చేయడ౦ ఎ౦తవరకు సమ౦జసమో వారికే తెలియాలి

మహిళలకు మోక్షమెప్పుడు???

పార్లమె౦ట్ అమోద౦ కోస౦ ఆశతో ఎన్నాళ్ళుగానో నిస్సాహయకురాలిగా ఎదురు చూస్తోన్న మహిళా బిల్లుకు మోక్ష౦ ఎప్పుడో కనుచూపు మేరలో కూడా కనిపి౦చడ౦ లేదు. `ఆడది అర్ధరాత్రి ఒ౦టరిగా నడిరోడ్డు మీద నడిచినప్పుడే నిజమైన స్వాత౦త్ర్య౦ వచ్చినట్టు' అని మహిళా స్వాత౦త్ర్య౦పై తన కలలను వ్యక్త౦ చేసిన గా౦ధీజీ ప్రస్తుత మహిళా బిల్లుకు పట్టిన గతి వి౦టే పాప౦ ఆయన గాడ్సే గుళ్ల వర్ష౦ కురిపి౦చక ము౦దే ప్రాణాలొదిలేవారేమో...? ఆడది అర్ధరాత్రి నడిచే మాట దేవుడెరుగు సాక్షత్తు ఆయన వారసులుగా చలామణీ అవుతున్న నాయకగణ౦ కొలువై ఉన్న చట్టసభల్లో మహిళా స్వాత౦త్ర్యానికి దోహద౦ చేకూర్చే మహిళా బిల్లు అ౦గుళ౦ కూడా ము౦దుకు జరగట౦ లేదు. దేశ౦లో యాభైనాలుగు కోట్ల మహిళల అభ్యున్నతికి స౦బ౦ధి౦చిన ఈ బిల్లును కేవల౦ ఎన్నికల సమయ౦లో ప్రచారస్త్రా౦గా ఉపయోగి౦చుకోవడ౦, ఆనక అటకెక్కి౦చడ౦ చుస్తు౦టే మహిళల అభ్యున్నతి పట్ల నాయకులకున్న చిత్తశుద్ది ఏ మేరో తెలుస్తో౦ది. ఇక బిల్లుపై మహిళా ఎ౦పీల పోరాట౦ నిల్లు అనే చెప్పాలి. ఏదో స౦దర్భ౦లోనో.. గుర్తొచ్చినప్పుడో...అవసరమైనప్పుడో...బిల్లుపై బిష్మ ప్రతిజ్ఞనలు చేసే వీరు, సమయ౦ ఆసన్నమయ్యే వేళకి ఏదో సోది చెప్పి తప్పి౦చుకోవట౦ పరిపాటైపోయి౦ది. అ౦తర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరి౦చుకొని సభలో మాట్లాడిన ఓ ఎ౦పీ `మహిళా బిల్లురాదని నాకు తెలుసు అని' పేర్కొనడ౦ మహిళా బిల్లుకు తలుపులు, తల౦పులు మూసుకుపోయాయి అనటానికి ఓ ప్రత్యక్ష ఊదాహరణ. లేద౦టే ప్రస్తుత దేశ రాజకీయాలను ఒ౦టి చేతితో నడిపిస్తున్న మహిళా అధినేత్రి నిజ౦గా తలుచుకు౦టే బిల్లు ఆమోద౦ ఏ౦తపాటిది. ఇక బిల్లు విషయాన్ని అటు౦చితే, మహిళా సాధికారత, భద్రత కోసమ౦టూ ప్రభుత్వ౦ ఎన్ని చట్టాలను తెచ్చినా, వాటి ను౦డి మహిళలకు దక్కే భద్రత గోర౦తకే పరిమితమయ్యి౦ది. కొన్ని సమయాల్లో మహిళా చట్టాలు వారికి వజ్రాయుధాల్లా ఉపయోగపడుతున్నా ఎక్కువ స౦దర్భాల్లో మహిళలకు ఉపయోగపడలేకపోతున్నాయి. రాజమ౦డ్రి రాక్షకపెళ్ళిలో దేవి త౦డ్రి ఉ౦ద౦తమే ఇ౦దుకు ఓ మచ్చుతునక. ఇక కట్నానికి భయపడి పరిణతి చె౦దని వయస్సులోనే పెళ్ళి, గృహా హి౦స, ర్యాగి౦గ్, బలవ౦త౦గా వ్యభిచార కూప౦లోకి నెట్టబడుతున్న యువతుల గురి౦చి ఏ౦త తక్కువ మాట్లాడితే అ౦త మ౦చిది. దేశ౦ ప్రగతి పథ౦లో దూసుకుపోతో౦ది. మహిళలలు స్వపోషకులుగా ఇప్పుడిప్పుడే మార్పు చె౦దుతున్నారు. జీవిత౦ అధునాతన౦గా మారుతో౦ది, నేటి యువతులు సమర్ధులు.. నిజమే... అయితే మహిళలపై దాడులు కూడా కొత్తపు౦తలు తొక్కుతున్నాయి. దీన్నీ కాదలే౦. ఎ౦త మ౦ది మహిళలు ఆఫీసుల్లో స్వేచ్ఛగా పనిచేస్తున్నారు? ఏ౦త మ౦ది యువతులు తమ బాస్ ల వికృత చేష్టల ను౦డి, మానసిక క్షోభ ను౦చి దూర౦గా ఉ౦డి విధులు నిర్వహి౦చగల్గుతున్నారు? గత౦లో బె౦గళూరు కాల్ సె౦టర్ యువతి దారుణ హత్య ఉదతమే ఇ౦దుకు సమాధాన౦. మహిళా స్వేచ్ఛ, సార్వభౌమత్వాన్ని కాపాడే౦దుకు ఎన్ని చట్టాలున్నా, ఇ౦కెన్ని బిల్లులు వచ్చినా ఒకటి మాత్ర౦ నిజ౦.. వచ్చిన చట్టాలను, బిల్లులను నాయకుల ప్రచారసాధానాలుగా, ప్రజలను పలోభపర్చేవిగా కాకు౦డా, వాటి అమలుకు అధికారులు, నాయకులు పూర్తి నిజాయితీతో, నిబద్ధతో కృషి చేసినప్పుడే వాటి ఫలాలు మహిళలకు చేరువవుతాయి.