Friday, August 10, 2007
ఐటీ నిపుణుల కలహాల కాపురాలు..!
మా అబ్బాయికి పెళ్ళి చేయాలని చూస్తున్నాం.. మా వాడి జీతం మాటకొస్తే యాభై వేలకు పైమాటే,,!!ఇక అమ్మాయి కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తే బాగుంటుందన్నది మా అభిప్రాయం.. కాపురానికి కావాల్సిన డబ్బులు కాస్త ఆదా చేసుకోవచ్చు..పై పెచ్చు సేవింగ్స్ కూడా చేయచ్చు కదా?? ఏమంటారు?? ఇది ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల తల్లిదండ్రుల మాట.. అయితే, జీతం బాగుంటే జీవితం బాగుంటుందనుకోవడం పొరపాటే..ఎందుకంటే ఎంత ఎక్కువ జీతం వస్తే అంత ఆందోళన ఎక్కువవుతుందన్నది తాజా సర్వేల్లో తేలిన నిజం. మరోవైపు వీరి వైవాహిక జీవితాలు కూడా ఏమాత్రం సాఫీగా సాగడంలేదన్నది తాజా అధ్యయనాల సారాంశం. ఇలాంటి కేసులు చెన్నైలో మరింత ఎక్కువగా ఉన్నాయట.. చెన్నైలోని ఫ్యామిలీకోర్టుల్లో దాఖలైన మొత్తం విడాకుల కేసుల్లో ఏకంగా 40 శాతం ఐటీ, బీపీవో రంగాలకు చెందినవారివే కావడం ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. గత సంవత్సరం చెన్నైలో దాఖలైన మొత్తం విడాకుల కేసులు 3000 కాగా, ఈ ఏడాది జూన్ నాటికే ఈ సంఖ్య దాటేసింది. వీటిలో ఎక్కువభాగం ఐటీ ఉద్యోగులవే. కొన్నేళ్ల క్రితం వరకూ ఖాళీగా కనిపించిన ఫ్యామిలీ కోర్టులు కూడా ఇప్పుడు కేసులతో కిక్కిరిసిపోతున్నాయి. న్యాయవ్యవస్ధ, చట్టాలపై అవగాహన ఎక్కువవడంతో కలహాల కాపురాలన్నీ ఇప్పుడు కోర్టు గుమ్మంలోకి చేరుతున్నాయి. మరోవైపు ఇలాంటి కేసులతోనే తమను ఎక్కువమంది ఆశ్రయిస్తున్నారని చెన్నైలోని డాక్టర్లు చెబుతున్నారు. "ఐటీ ఉద్యోగమంటే బుర్రతో పని,దీని ప్రభావం వైవాహిక జీవితంపై పడుతుంది. మానసికంగా అలిసిపోవడం వల్ల శృంగారంలో ఆసక్తి, సామర్ధ్యం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళు పెటాకులవ్వడానికి ఇది కూడా ఒక కారణం, ఐటీ ప్రొఫెషనల్స్ 28 ఏళ్ళు వచ్చేసరికి హైపర్ సెన్సిటివ్ గా తయారవుతున్నారు. ఇక 35 ఏళ్ళు వచ్చేసరికి మానసికంగా పూర్తిగా అలసిపోతున్నారన్నది వారి వాదన. పని ఒత్తిడి, అహం, భార్యాభర్తలు ఎక్కువసేపు విడివిడిగా ఉండటం, సహోద్యోగుల సాన్నిహిత్యం ఎక్కువవడం, ఐటీ ఉద్యోగాల్లో ఇవే విడాకులకు ఎక్కువగా కారణాలవుతున్నాయి. వీరిలో 99 శాతం మంది పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో వివాహాన్ని వారు కేవలం సౌకర్యంగానే భావిస్తున్నారని లాయర్లు కూడా చెబుతున్నారు. అయితే, ఈ సమస్యలను అధిగమించడానికి ఐటీ, బీపీఓ కంపెనీలు వారి వారి కార్యాలయ ఆవరణల్లో కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. దీంతో కొంతవరకూ ఈ సమస్య తగ్గే అవకాశం ఉంది. మరి మీరు కూడ ఐటీ ప్రొఫెషనల్ ఆ? జాగ్రత్తగా ఉండండి.. పని ఒత్తిడి మీ వైవాహిక, కుటుంబ జీవనాలపై ప్రభావం చూపకుండా జాగ్రత్త పడటం ఎంతైనా మంచిది. కాస్తంత సమయాన్ని కుటుంబసభ్యులతో కేటాయించడనికి ప్రయత్నించండి.. ఆదివారం సాయంత్రం ఏ షికారుకో.. సినిమాకో...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment